పార్లమెంటు క్యాంటీన్ సబ్సిడీ ఎత్తేయండి! | Sakshi
Sakshi News home page

పార్లమెంటు క్యాంటీన్ సబ్సిడీ ఎత్తేయండి!

Published Mon, Jul 6 2015 3:02 AM

పార్లమెంటు క్యాంటీన్ సబ్సిడీ ఎత్తేయండి!

న్యూఢిల్లీ: పార్లమెంటు హౌస్ క్యాంటీన్‌లో చౌక ధరలకు ఆహారాన్ని ఇస్తున్నారంటూ విమర్శలు రావడంతో పలువురు ఎంపీలు దీనిపై భగ్గుమన్నారు. 2013-14లో పార్లమెంటు కాంప్లెక్స్‌లోని 6 క్యాంటీన్లలో సబ్సిడీతో ప్రభుత్వంపై రూ.14కోట్ల భారం పడడం తెలిసిందే. చాలా ప్రభుత్వ క్యాంటీన్లలో ఇలాంటి ప్రయోజనాలే ఉన్నాయని, పార్లమెంటు క్యాంటీన్‌లోనే రాయితీ ఇస్తున్నారనడం విడ్డూరమని పలువురు ఎంపీలు వాపోయారు.

‘క్యాంటీన్ సబ్సిడీ కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతున్నారంటే ప్రజల్లో చెడు భావన వస్తుంది. దీన్ని ఎత్తేస్తే మేలు’ అని సిక్కిం ఎంపీ పీడీ రాయ్ చెప్పారు. పార్లమెంటు క్యాంటీన్‌లో  పార్లమెంటు సిబ్బంది, జర్నలిస్టులు తింటారని సీపీఎం ఎంపీ రాజేశ్ పేర్కొన్నారు. సబ్సిడీ ఎత్తేయడమే దీనికి పరిష్కారమనుకుంటే అలాగే చేయొచ్చన్నారు.

Advertisement
Advertisement