నగదు రహిత విరాళాలే పరిష్కారం | Sakshi
Sakshi News home page

నగదు రహిత విరాళాలే పరిష్కారం

Published Sat, Mar 11 2017 1:35 AM

నగదు రహిత విరాళాలే పరిష్కారం - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధనం వాడకాన్ని అడ్డుకునేందుకు పార్టీలకు నగదు రహిత విరాళాలే పరిష్కారమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ పేర్కొన్నారు. నగదురహిత విరాళాలు అత్యుత్తమమైనా అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేమని శుక్రవారం ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

మన సమాజం కూడా పార్టీలకు విరాళాలు నగదు రహితంగా ఉండాలనే కోరుకుంటుం దన్నారు. ఆ విధానంపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించలేద న్నారు. డిజిటల్‌ లావాదేవీల కోసం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పార్టీలకు ఒక వ్యక్తి ఇచ్చే విరాళాన్ని రూ. 2 వేలకు పరిమితం చేస్తూ తెచ్చిన సంస్కరణను పార్టీలు దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement