ఐదేళ్ల జీతం తిరిగి చెల్లించండి | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల జీతం తిరిగి చెల్లించండి

Published Wed, Feb 27 2019 3:16 AM

Madras High Court Says Disqualified MLAs Must Refund Salary - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపు చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు పొం దిన వేతనాన్ని నాలుగువారాల్లోగా తిరిగి చెల్లిం చాలని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పీ వేల్‌దురైని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పుచెప్పింది. తమిళనాడులో 2006లో జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో తిరునెల్వేలి జిల్లా చేరన్‌ మహా దేవీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పి. వేల్‌దురై, అన్నాడీఎంకే నుంచి మనోజ్‌ పాండియన్‌ పోటీచేశారు.

ఈ ఎన్నికల్లో వేల్‌దురై గెలుపొందారు. వేల్‌దురై గెలుపును సవాల్‌చేస్తూ మద్రాసు హైకోర్టులో మనోజ్‌పాండియన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనేక అక్రమాలకు పాల్పడి గెలుపొందారని పిటిషన్‌ లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను మద్రా సు హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాండియన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా విచారించిన సుప్రీం కోర్టు వేల్‌దురై ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పింది. అయితే తీర్పువెలువడే నాటికి వేల్‌దురై పదవీకాలం ముగిసింది. దీంతో ఎమ్మెల్యేగా వేల్‌దురై తన ఐదేళ్లకాలంలో పొం దిన వేతనాన్ని వెనక్కుతీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
Advertisement