పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య

Published Sun, Jan 5 2020 2:55 PM

Maharashtra Minister Aaditya Thackeray First Comments - Sakshi

ముంబై: మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఠాక్రేల కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన ఆదిత్య.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు.

ఆదివారం జరిగిన కేబినెట్‌ శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖ లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టూరిజంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని, సోమవారం జరిగే సమావేశానంతరం మంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. గతంలో శివసేన యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న ఆదిత్య ఠాక్రే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

చదవండి: శివసేనకు చెక్‌.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!

శివసేన-కాంగ్రెస్-ఎన్‌సీపీ సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వంలో గత డిసెంబర్ 30న కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ కోసం కేబినెట్‌లో కొత్త పదవిని సృష్టించబోతున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆదివారం జరిగిన శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖలను కేటాయించారు.

Advertisement
Advertisement