కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Published Tue, Jun 23 2015 6:00 PM

కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ముంబై/ న్యూఢిల్లీ: ముంబైలో కల్తీ మద్యం సేవించి 102 మంది మృతిచెందిన కేసులో ప్రధాన నిందితుడిని న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే పూర్తివివరాలను పోలీసులు వెల్లడించలేదు. గత వారం ముంబైలో కల్తీ మద్యం సేవించడం వల్ల 102 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాధీన్ క్షత్రియ ఈ దర్యాప్తుకు నేతృత్వం వహించారు.అక్రమంగా దేశీయ మద్యం తయారు చేయడంతో అది సేవించిన 102 మంది మరణించడంతో పాటు మరో 46 మంది అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

పశ్చిమ ముంబైలోని మాల్వని కాలనీలో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనపై మూడు నెలల్లో నివేదిక అందిచనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే తెలిపారు. అయితే, మిథనాల్ రంగు కూడా మార్చాలని, లేకుంటే అంధత్వం వచ్చే అవకాశముందని తయారీదారులకు ఆయన సూచించారు. ఇదిలాఉండగా.. 2009లో కల్తీ మద్యంపై తానిచ్చిన కేసును మాల్వాని పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్థానికుడు ముస్తఫా ఖాన్ మీడియాకు తెలిపాడు.

Advertisement
Advertisement