వైరల్‌ : నల్ల చిరుతను చూశారా? | Sakshi
Sakshi News home page

వైరల్‌ : నల్ల చిరుతను చూశారా?

Published Sun, Jul 5 2020 5:27 PM

Majestic Images Of Black Panther Goes Viral - Sakshi

బెంగళూరు : సినిమాల్లో చూపించే కొన్ని కల్పిత జంతువులు నిజంగా ఉంటాయా అనే సందేహం చాలా సార్లు కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంగిల్‌ బుక్‌ చిత్రంలో భగీరా పేరిట చూపెట్టిన నల్ల చిరుత నిజంగా ఉంటుందా లేదా అనే చర్చ అయితే తీవ్రంగానే జరిగింది. అయితే ఆ సినిమాలో చూపెట్టిన నల్ల చిరుత పులులు నిజంగానే ఉన్నాయి. అది కూడా మన భారతదేశంలోనే. కర్ణాటకలోని నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌లో కాబిని నది పరిసరాల్లో నల్ల చిరుత పులులు ఉన్న సంగతి తెలిసిందే. వైల్డ్‌లైఫ్‌ ఫొటోలు ప్రచురించే ‘ఎర్త్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో వీటిని షేర్‌ చేసింది. దీంతో అవి కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారాయి.(చదవండి : సైకిల్ గ‌ర్ల్‌పై అత్యాచారం, హ‌త్య‌: నిజ‌మెంత‌?)

వాస్తవానికి ఈ ఫొటోలను 2019లో ప్రముఖ వైల్డ్‌లైఫ్‌ పొటోగ్రాఫర్‌ షాజ్ జంగ్ తీశారు. కాబిని నది పరిహహాక ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉన్న వైల్డ్‌క్యాట్స్‌కు సంబంధించి జంగ్ అనేక ఫొటోలు తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ప్రకృతి చాలా గొప్పదని అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం.. ‘జంగిల్‌ బుక్‌ చిత్రంలోని భగీరా నువ్వేనా’అని పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము గతంలో తీసిన బ్లాక్‌ పాంథర్‌ చిత్రాలను కూడా షేర్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement