మోదీ నిర్ణయం.. పాశవిక చర్య! | Sakshi
Sakshi News home page

మోదీ నిర్ణయం.. పాశవిక చర్య!

Published Wed, Nov 9 2016 12:20 AM

మోదీ నిర్ణయం.. పాశవిక చర్య! - Sakshi

కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ చర్యను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.500, వెయ్యి రూపాయల రద్దు నిర్ణయంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఏ మాత్రం దయ లేకుండా తీసుకున్న (పాశవిక) నిర్ణయమని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఈ కరెన్సీ రద్దు చాలా ఇబ్బందికరమన్నారు.

వారం మొత్తం కష్టపడి మన సోదర, సోదరిమణులు రూ.500 సంపాదించగలరు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజుల్లో వారు కనీస అవసరాల వస్తువులు కూడా కొనుకోలు చేయలేరని మోదీ గుర్తించలేకపోయారా అని ప్రశ్నించారు. నల్లధనం, అవినీతికి తాము కూడా ఎప్పుడూ వ్యతిరేకిస్తామని చెప్పిన మమతా బెనర్జీ... సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు పొందడం కూడా కష్టతరమం అవుతుందన్నారు. 100రూపాయల నోట్లు కేవలం బ్యాంకులలో ఉన్నాయని, అవి మార్కెట్లోకి రాకముందే మోదీ ఇలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నల్లధనం, అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న యోచనలో భాగంలో చేశామని కేంద్ర చెబుతున్న విషయాలను కేజ్రీవాల్ ఖండించారు. మమతా బెనర్జీకి ఆయన తన మద్ధతు తెలుపుతూ ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేశారు.
 

Advertisement
Advertisement