అలా చేయలేమన్న దీదీ‌.. | Sakshi
Sakshi News home page

అలా చేయలేమన్న దీదీ‌..

Published Tue, Aug 21 2018 4:54 PM

Mamata Govt Says Cannot Stop Animal Slaughter - Sakshi

కోల్‌కతా : బక్రీద్‌ సందర్భంగా జంతుబలిని నియంత్రించాలన్న కోర్టు ఉత్తర్వులకు బదులిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. జంతు వధను నిలిపివేసేందుకు అవసరమైన మౌలిక యంత్రాంగం తమ వద్ద లేదని కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రమంతటా ప్రతి సబ్‌ డివిజన్‌లోని అన్ని బ్లాక్‌ల్లో ఈద్‌ ఉల్‌ జుహ జరుపుకుంటారని పశ్చిమ బెంగాల్‌ జంతు వధ నియంత్రణ చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు తగిన యం‍త్రాంగం ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. రాష్ట్రంలో తగినంతగా వెటర్నరీ సర్జన్లు, వెటర్నరీ అధికారులు లేరని కోర్టుకు నివేదించింది. కబేళాలు సైతం చాలినంతగా లేవని స్పష్టం చేసింది.

వచ్చే క్యాలండర్‌ సంవత్సరాంతానికి సంబంధిత చట్టానికి అనుగుణమైన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటామని పేర్కొంది. కాగా ఈద్‌ ఉల్‌ జుహ వేడుకులకు ముందు జంతు వధ నియం‍త్రిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బహిరంగ నోటీసు జారీ చేయాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బక్రీద్‌కు ముందుగా జంతు వధ నియంత్రణపై ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలని కోరింది.

Advertisement
Advertisement