44 తీవ్ర నేరాలు.. పార్టీ టికెట్‌ ఖరారు | Sakshi
Sakshi News home page

44 తీవ్ర నేరాలు.. పార్టీ టికెట్‌ ఖరారు

Published Wed, Dec 28 2016 8:19 PM

44 తీవ్ర నేరాలు.. పార్టీ టికెట్‌ ఖరారు - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కోసం సమాజ్‌ వాది పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవాళ్లు ఎక్కువమందే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం సమాజ్‌ వాది పార్టీ అధినేత తొలి జాబితాగా 325మంది అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. మరో 78 మంది జాబితా విడుదల చేయాల్సి ఉంది. తొలి జాబితాలో ములాయం కుమారుడు అఖిలేశ్‌కు చోటు లేకపోగా ఆయన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కు మాత్రం ఈ జాబితాలోనే అవకాశం ఇచ్చారు.

అయితే, ములాయం విడుదల చేసిన తొలి జాబితాలో అతిక్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయనపై 44 అతి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇందులో హత్య కేసులు కూడా మినహాయింపు కాదు. అయితే, ఇతడిని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించగా శివపాల్‌ యాదవ్‌ మాత్రం గట్టి మద్దతిచ్చారు. అహ్మద్‌కు సీటు ఇవ్వాల్సిందేనంటూ ములాయంకు ప్రతిపాదించారు. ఆయన కూడా శివపాల్‌ మాటనే వింటూ అతడికి సీటు ఇచ్చారు. దీనిపై అఖిలేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క అతిక్‌ మాత్రమే కాకుండా నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement