‘కేజ్రీవాల్‌కు డబుల్‌ పనిష్‌మెంట్‌’

28 Feb, 2020 12:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఆప్‌ నేతలు దోషులుగా తేలితే రెండింతలు శిక్ష ఉండాలన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ ఎద్దేవా చేశారు. అసలు ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌నూ శిక్షించాలని దుయ్యబట్టారు. ఐబీ ఉద్యోగి హత్యోదంతంలో ఆప్‌ కార్పొరేటర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై కేసు నమోదైన క్రమంలో మనోజ్‌ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డబుల్‌ పనిష్‌మెంట్‌ అంటే..ఇప్పుడు తాహిర్‌తో పాటు ఆయన బాస్‌ను కూడా కఠినంగా శిక్షించాలి..ఐబీ అధికారిని అమానుషంగా కత్తితో 400 సార్లు పొడిచి చంపిన ఈ కేసులో నిందితులను, కుట్రదారులను నిర్ధిష్ట కాలపరిమితి విధించి ఉరితీయాల’ని మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. కాగా ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై కౌన్సిలర్‌ తాహిర్‌ హుసేన్‌ను ఆప్‌ తమ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఐబీ అధికారిని తాహిర్‌ హుస్సేన్‌ మనుషులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారని బాధితుడి కుటుం సభ్యులు సైతం ఆరోపించారు. ఐబీ అధికారి మృతదేహం ఆ తర్వాత చాంద్‌బాగ్‌ ప్రాంతంలోని డ్రైనేజ్‌లో లభ్యమైంది. ఈ హత్య కేసులో ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి : అంకిత్‌ శర్మ హత్య: తాహిర్‌పై ఆప్‌ వేటు

మరిన్ని వార్తలు