ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

Published Mon, Aug 27 2018 2:15 AM

Maoist killed in counter-shootings - Sakshi

పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలకు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందాడు. కాల్పాల్‌ సమీపంలో మావోలు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలంలో పోలీసులకు ఒక మావోయిస్టు మృతదేహంతోపాటు ఆయుధాలు లభ్యమయ్యాయి.

ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన జిల్లా ఏస్పీ జితేంద్ర శుక్లా కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని సోమ వడ్డాగా గుర్తించామన్నారు. కాగా, కాంకేర్‌ జిల్లా సమీపంలోని అడవుల్లో వేర్వేరు చోట్ల మావోలు అమర్చిన ఏడు టిఫిన్‌ బాక్స్‌ బాంబులను ఆదివారం పోలీసులు నిర్వీర్యం చేశారు. బాంబులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకు న్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌ భగత్‌ తెలిపారు.

వ్యాపారిని హత్య చేసిన మావోలు
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధ జిలా బొడ్ల స్వరూప్‌కు చెందిన కిరాణా వ్యాపారి ప్రసాద్‌ శర్మని మావోలు శనివారం దారుణంగా కాల్చి చంపారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారినందునే ప్రసాద్‌ను చంపినట్లు ఘటనా స్థలంలో లేఖ వదిలివెళ్లారు. ఘటనపై జల్మాల పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement