ప్రేమంటే ఇదేరా.. ఆసుపత్రిలోనే పెళ్లి | Sakshi
Sakshi News home page

ప్రేమంటే ఇదేరా.. ఆసుపత్రిలోనే పెళ్లి

Published Sun, Nov 12 2017 5:52 PM

marriage made in hospital in kolkata - Sakshi

సాక్షి, కలకత్తా: సాధారణంగా పెళ్లిళ్లు ఏ పెళ్లి మండపంలోనో.. ఇంటిముందు పెళ్లి పందిట్లోనో జరుగుతాయి. కానీ సోదీ అరేబియాలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన వ్యక్తి ఆలం తాను ప్రేమించిన అమ్మాయిని ఆసుపత్రిలో వివాహం చేసుకున్నాడు. వివరాల్లొకి వెళితే.. కొల్‌కతాకు చెందిన ఆలం అనే వ్యక్తి సౌదీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ న్యాయసలహా సంస్థలో న్యాయవాదిగా పనిచేస్తోన్న కోల్‌కతాకు చెందిన హేరాతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు పెళ్లికి పెద్దలను ఒప్పించారు. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని పెళ్లికి ముహుర్తం కరారు చేశారు. 

అయితే ముహుర్తానికి ముందు రోజు హేరాకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన ఆలం తన పెళ్లి వాయిదా పడకూడదని భావించిన సౌదీ నుంచి కోల్‌కతాకి వచ్చాడు. ఏకంగా హేరా చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆమెని పెళ్లాడాడు. ఇటువంటి సమయంలో వీలైతే వదిలేయానుకునే రోజుల్లో ఇలాంటి వ్యక్తి అల్లుడు కావడం తమ అదృష్టమని హేరా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 
 

Advertisement
Advertisement