'మారిషస్‌లో అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహం' | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్‌ ఉపాధ్యకుడు

Published Tue, Feb 27 2018 4:50 PM

Mauritius vise president paramasivam pillai visits tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలకు చేరుకున్నఆయనకు టీటీడీ ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా పరమశివం మాట్లాడుతూ.. భారత్,మారిషస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మారిషస్ 50వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 108 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహాన్ని జూలై 1న మారిషస్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. మారిషస్‌లో భారతదేశ వాతావరణమే ఉంటుందని.. హిందువుల పండుగలుకు ప్రభుత్వ సెలవులుతో ఉంటాయని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement