రేపట్నుంచి మహారాష్ట్రలో మాయవతి ప్రచారం | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి మహారాష్ట్రలో మాయవతి ప్రచారం

Published Mon, Oct 6 2014 7:30 PM

రేపట్నుంచి మహారాష్ట్రలో మాయవతి ప్రచారం - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రచార సభల్లో పాల్గొంటారు.

ఎనిమిది జిల్లాలో మాయావతి పర్యటించనున్నట్టు బీఎస్పీ ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఎవరితో పొత్తు కుదుర్చుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది.

Advertisement
Advertisement