ఎండీఎంకే చీఫ్‌ వైగోకు చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

ఎండీఎంకే చీఫ్‌ వైగోకు చేదు అనుభవం

Published Fri, Jun 9 2017 1:13 PM

ఎండీఎంకే చీఫ్‌ వైగోకు చేదు అనుభవం

కౌలాలంపూర్‌:  ఎండీఎంకే చీఫ్‌ వైగోకు మలేషియాలో చేదు అనుభవం ఎదురైంది. ఎల్‌టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనను శుక్రవారం కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. కొన్ని గంటల పాటు వైగోను అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా 2001లో ఎల్‌టీటీఈలకు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు. 2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో  ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు.

Advertisement
Advertisement