Sakshi News home page

105 ఏళ్ల క్రితమే కేరళలో నెలసరి సెలవులు

Published Mon, Aug 21 2017 8:49 AM

Menstrual leave debate: A school in Kerala began granting period break to girls 105 years ago

తిరువనంతపురం: మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. 105 ఏళ్ల క్రితమే కేరళలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నెలసరి సెలవులు ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి.

1912లో కొచ్చిన్‌ రాజ్యం(ఇప్పటి ఎర్నాకులం జిల్లా)లోని త్రిపునిథురలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చేవారని  చరిత్రకారుడు పి.భాస్కరనుణ్ణి ‘19వ శతాబ్దంలో కేరళ’ పుస్తకంలో రాశారు. ఈ సెలవుల మంజూరును అప్పటి విద్యాశాఖ డైరెక్టర్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement