Sakshi News home page

భారీ ఊరట : పట్టాలెక్కనున్న 400 ప్రత్యేక రైళ్లు

Published Fri, May 1 2020 5:34 PM

Ministry of Home Affairs allows special trains - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వేశాఖ సిద్ధం చేసింది. (సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే)

టికెట్‌ ఎంత అన్నది నిర్ణయించడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామజిక దూరం పాటించేలా నిబంధనలు పాటించాలని సూచించింది.(ప్రత్యేక రైళ్లు; మార్గదర్శకాలు ఇవే..)  లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీసిన విషయం తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమవారిని స్వస్థలాలకు తరలించడానికి, రైళ్లను నడపాలని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో, కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.(తెలంగాణ నుంచి తొలి రైలు)

Advertisement
Advertisement