14 నుంచి చైనా పర్యటన | Sakshi
Sakshi News home page

14 నుంచి చైనా పర్యటన

Published Wed, May 6 2015 2:00 AM

14 నుంచి చైనా పర్యటన - Sakshi

- 3 రోజులపాటు బిజీబిజీ..స్వయంగా తెలిపిన మోదీ
- 17న మంగోలియా,18న ద.కొరియాలో పర్యటన

న్యూఢిల్లీ:
ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వయంగా ప్రకటించారు. చైనీస్ మైక్రోబ్లాగ్ వెబ్‌సైట్ ‘వీబో’లో ఇటీవలే ఖాతా తెరిచిన మోదీ  అందులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసియాలో శాంతి, సుస్థిరతను పెంపొందించే దిశగా చైనా నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాతో స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.     

మూడు దేశాలు.. ఆరు రోజులు
మోదీ విదేశీ పర్యటనపై విదేశాంగ శాఖ  ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఆరు రోజుల పర్యటనలో భాగంగా మోదీ మొదట చైనాలో తర్వాత మంగోలియా, దక్షిణ కొరియాలో పర్యటిస్తారని పేర్కొంది.

3 రోజుల చైనా పర్యటనలో భాగంగా అక్కడి భారతీయ సమాజం షాంఘైలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారని తెలిపింది. దీనికి 45 వేల మంది భారతీయులు హాజరవుతారని అంచనా. 17న మోదీ మంగోలియా వెళతారు. ఆ దేశంలో అడుగుపెడుతున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఆయన 18న దక్షిణ కొరియాలో పర్యటిస్తారు.

Advertisement
Advertisement