Sakshi News home page

మళ్లీ నగదు బదిలీ?

Published Mon, Jul 21 2014 1:49 AM

మళ్లీ నగదు బదిలీ?

ఆధార్ లింకుతో అమలు చేసే ఆలోచనలో కేంద్రం
 
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత నగదు బదిలీ తలనొప్పి మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వంటగ్యాసు సిలిండర్లపై సబ్సిడీని ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు జమచేసే ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించడం... పథకాల్లో లోటుపాట్లతో అధికారం నుంచి దిగిపోయే ముందు పక్కనపెట్టడం తెలిసిందే. అయితే, నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టేందుకు మళ్లీ నగదు బదిలీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ మొదలు పెట్టవచ్చని, పథకం పనితీరును అంచనావేసే పని మొదలైనట్లు అధికారులు తెరలిపారు. 300 జిల్లాల్లో పథకం ప్రభావాన్ని అంచనా వేసి ఆగస్టు 15లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీంతోమ జిల్లాల్లో పర్యటించి ఓ నివేదికను రూపొందించే పనిలో ప్రణాళికా సంఘం, భారత విశిష్ట గుర్తింపు సంఖ్య సంస్థ అధికారులు ఉన్నారని తెలిపాయి.
 
 

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement