ఎస్సీ వర్గీకరణ చేపట్టండి  | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ చేపట్టండి 

Published Wed, Jan 31 2018 3:36 AM

mp nandi yellaiah appealed to prime minister on sc classification

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వీలుగా బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ నంది ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈమేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వీలుగా జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదిక కేంద్ర కేబినెట్‌ వద్ద 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష గోయల్‌కు నంది ఎల్లయ్య మరో వినతిపత్రం ఇచ్చారు. గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా నిర్మించాలని విజ్ఞప్తిచేశారు.

వెనుకబడిన ప్రాంతాలైన నాగర్‌కర్నూలు, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేటలకు ఈ లైను ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు నంది ఎల్లయ్య మరో విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంత నిరుపేద చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కేంద్రీయ విద్యాలయ సీట్లలో ఎంపీ కోటాను 10 సీట్ల నుంచి 20 సీట్లకు పెంచాలని కోరారు. 

Advertisement
Advertisement