శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ | Sakshi
Sakshi News home page

శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ

Published Tue, Mar 20 2018 3:06 AM

Mukhtar Abbas Naqvi presented the PM Modi's sheet in the dargah of Khwaja Saheb in Ajmer - Sakshi

జైపూర్‌: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్‌ ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనా రిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్‌ ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శాంతి, సామ రస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వ వేత్త ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ నిలుస్తారు’ అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement