ముర్తాల్ గ్యాంగ్ రేప్: విస్మయకర విషయాలు | Sakshi
Sakshi News home page

ముర్తాల్ గ్యాంగ్ రేప్: విస్మయకర విషయాలు

Published Tue, May 31 2016 10:23 AM

ముర్తాల్ గ్యాంగ్ రేప్: విస్మయకర విషయాలు - Sakshi

చండీగఢ్: హర్యానాలో జాట్ల ఆందోళన సందర్భంగా ముర్తాల్ లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న ప్రకాశ్ కమిటీ తన నివేదికలో కీలక అంశాలు పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇందులోని అంశాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఈ నివేదికను సోమవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు సమర్పించింది. గ్యాంగ్ రేప్ లు జరగలేదన్న ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఇందులో అంశాలున్నట్టు వెల్లడైంది.

'ఫిబ్రవరి 22న జాట్ల ఆందోళన ముర్తాల్ లో నగ్నంగా మహిళలు రోడ్డుపక్కన దాబా హోటలో తలదాచుకున్నారు. దాబా యాజమాని స్టేట్ మెంట్ ను ముగ్గురు సభ్యుల ప్రకాశ్ కమిటీ రికార్డ్ చేసింది. తన హోటల్ లో తలదాచుకున్న మహిళలకు దుప్పట్లు, బట్టలు ఇచ్చానని దాబా యజమాని చెప్పాడు. తర్వాత వారిని సురక్షితంగా ఇంటికి పంపించాడని రిపోర్ట్ లో పేర్కొంద'ని అమికస్ క్యూరీ అనుమప్ గుప్తా వెల్లడించారు.

అయితే అత్యాచారాలు జరగలేదని దాబా యజమాని తమ ఇంటరాగేషన్ లో చెప్పాడని కోర్టుకు 'సిట్' చీఫ్‌ మమతా సింగ్ తెలిపారు. కోర్టులో విచారణ సందర్భంగా గుప్తా, హర్యానా ప్రభుత్వ తరపు న్యాయవాది లోకేశ్ సిన్హాల్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
 

Advertisement
Advertisement