ట్రిపుల్‌ తలాక్‌పై తొలిసారి పెదవి విప్పిన మోదీ! | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌పై తొలిసారి మోదీ స్పందన

Published Sun, Dec 31 2017 3:14 PM

Muslim women have found way to free themselves from practice of triple talaq - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ను లోక్‌సభ ఆమోదించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుతో శతాబ్దాల ముస్లిం మహిళల వేదనకు ముగింపు పలికినట్లు అయిందని మోదీ అన్నారు. ఈ చట్టం వల్ల ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రబలమైన ఈ ఆచారం కారణంగా ముస్లిం మహిళలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
కొత్త ఏడాది ప్రజలంతా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అన్నారు. కొత్త ఏడాదిలో కూడా.. అవినీతి, నల్లధనం, బినామీ ఆస్తులపై పోరాటం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘అందరితో కలసి.. అందరి అభివృద్ధి’ అంటూ నూతన సంవత్సర సందేశం ఇచ్చారు.

Advertisement
Advertisement