Sakshi News home page

'నాన్సెన్స్' వ్యాఖ్యలపై రాహుల్ పశ్చాతాపం

Published Thu, Oct 3 2013 6:47 PM

'నాన్సెన్స్' వ్యాఖ్యలపై రాహుల్ పశ్చాతాపం - Sakshi

ఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్ను తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేశారు.  నేర చరిత కల్గిన ప్రజాప్రతినిధులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ 'చెత్త' అని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ ని  తల్లి సోనియా గాంధీ మందలించారు. అలా మాట్లాడటం సరికాదని సోనియా తెలపడంతో రాహుల్ వెనక్కు తగ్గారు.  తనకూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని ఆ క్రమంలో భాగంగానే ఆర్డినెన్స్ పై అలా మాట్లాడివలసి వచ్చిందన్నారు.  కాగా, ఆ సందర్భంలో కొంత కఠినంగా వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అలా మాట్లాడకుంటా ఉండాల్సిందని రాహుల్ తెలిపారు.

 

కోర్టుల్లో దోషులుగా తేలే చట్టసభల సభ్యులను తక్షణ అనర్హత వేటు నుంచి కాపాడేందుకు తెచ్చిన ఆర్డినెన్‌‌స మతిలేని చర్య అని, దాన్ని చింపి పారేయాలని రాహుల్‌ సంచలన విమర్శలు చేయడం తెలిసిందే. ఇది ప్రధానిని అవమానించడమేనని, మన్మో„హన్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో సోనియా కూడా ఆ మాటలను సమర్దించకపోవడంతో రాహుల్ వెనక్కి తగ్గారు.

Advertisement
Advertisement