నా భార్యకు.. ఏడుగురు భర్తలు! | Sakshi
Sakshi News home page

నా భార్యకు.. ఏడుగురు భర్తలు!

Published Tue, Sep 20 2016 9:28 AM

నా భార్యకు.. ఏడుగురు భర్తలు! - Sakshi

తన భార్యకు తాను కాక మరో ఏడుగురు భర్తలున్నారని.. అంతమందిని పెళ్లి చేసుకోవడం ద్వారా తనను మోసం చేయడమే కాక, రోజూ కొడుతోందని ఓ భర్త వాపోయాడు. ఆమె బారి నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ బెంగళూరులోని కేజీ హళ్లి పోలీసులను ఆశ్రయించాడు. తూర్పు బెంగళూరులోని కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య యాస్మిన్ బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాస్మిన్‌కు మగవాళ్లను మోసం చేసే అలవాటు ఉందని, ఆమె తన మీద దాడి చేస్తోందని వాపోయాడు.

యాస్మిన్ తమను కూడా పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే మరో ఇద్దరు పోలీసులకు తెలిపారు. యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు అడిగిందని, ఇవ్వనని చెప్పేసరికి తనను వదిలి వెళ్లిపోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పనిచేసే అఫ్జల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ముందుగా ఇమ్రాన్ మీద దాడిచేసి కొట్టినందుకు యాస్మిన్ మీద కేసుపెట్టారు. ఇక ఎనిమిది మంది మగాళ్లను మోసంచేసిన విషయంలో ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement