బీజేపీలో చేరిన నెపోలియన్ | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నెపోలియన్

Published Mon, Dec 22 2014 3:32 AM

బీజేపీలో చేరిన నెపోలియన్ - Sakshi

  • అమిత్‌షా సమక్షంలో చేరిక
  • చెన్నై: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి డి. నెపోలియన్ ఆదివారం బీజేపీలో చేరారు. శనివారమిక్కడ డీఎంకేకు రాజీనామా చేసిన నెపోలియన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. డీఎంకేలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేదే లేదని ఆయన అన్నారు. . ప్రధాని మోదీ పనితీరు అద్భుతమని కొనియాడారు. అమిత్ రెండు రోజుల తమిళనాడు పర్యటనలో బీజేపీలో చేరిన మూడో ప్రముఖుడు నెపోలియన్.

    గేయ రచయిత గంగై అమరన్, కొరియోగ్రాఫర్ గాయత్రీ రఘురామ్ శనివారం బీజేపీలో చే రారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి నెపోలియన్ సన్నిహితుడు. ఆయన 2009-2012 మధ్య యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే అళగిరికి మద్దతుగా నిలవడంతో డీఎంకేలో నెపోలియన్‌కు ప్రాధాన్యం తగ్గింది.

Advertisement
Advertisement