జమ్మూకాశ్మీర్కు రూ. 1000 కోట్ల సాయం | Sakshi
Sakshi News home page

జమ్మూకాశ్మీర్కు రూ. 1000 కోట్ల సాయం

Published Sun, Sep 7 2014 4:17 PM

Narendra Modi announces Rs.1,000 crore aid for Jammu and Kashmir

జమ్మూ: వరదలతో అతలాకుతలం అయిన జమ్మూకాశ్మీర్కు ప్రధాని నరేంద్ర మోడీ వెయ్యి కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించారు. ఆదివారం మోడీ ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.

వరదల్లో మరణించినవారికి రెండు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేల రూపాయల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి అందజేయనున్నట్టు మోడీ ప్రకటించారు. వరదల కారణంగా కలిగిన నష్టం జాతీయ విపత్తులాంటిదని, జమ్మూకాశ్మీర్ ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని మోడీ హామీ ఇచ్చారు. వరదల కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతినగా, వందమందికిపైగా మరణించారు.

Advertisement
Advertisement