ఆ కస్టమర్‌కు రూ.4 కోట్లు చెల్లించండి | Sakshi
Sakshi News home page

ఆ కస్టమర్‌కు రూ.4 కోట్లు చెల్లించండి

Published Thu, Sep 12 2019 8:30 AM

NCDRC Orders Developer to Refund Rs 4 Crore to Buyer - Sakshi

న్యూఢిల్లీ: తన కస్టమర్‌కు చెల్లించాల్సిన రూ.4 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిహారాల కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఆదేశించింది. అలోక్‌ కుమార్‌కు రూ.4.12 కోట్లు చెల్లించాల్సిందిగా హరియాణాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఆదేశించింది. ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో ఉంటున్న అలోక్‌.. భారత్‌కు తిరిగొచ్చాక ఉండటానికి ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావించారు. దీంతో గోల్డెన్‌ పీకాక్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డెవలపర్స్‌కు ఓ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు కోసం బ్యాంకు లోను తీసుకున్నారు. ఈమేరకు 2015 సెప్టెంబర్‌ కల్లా దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించారు. అయితే తాను ఇండియాకి వచ్చి చూడగా తన ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2015లోనే దానికి సంబంధించిన పనులు ఆగిపోయాయని గుర్తించిన అలోక్‌ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు.

Advertisement
Advertisement