ఇక పీఎఫ్ విత్‌డ్రాయల్ 75 శాతమే! | Sakshi
Sakshi News home page

ఇక పీఎఫ్ విత్‌డ్రాయల్ 75 శాతమే!

Published Tue, Jul 7 2015 12:23 AM

ఇక పీఎఫ్ విత్‌డ్రాయల్ 75 శాతమే! - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) సభ్యులు తమ భవిష్య నిధి నుంచి గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే నగదును 75 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మొత్తం(25%) ఆ సభ్యులు 58 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఈపీఎఫ్‌ఓ వద్దే ఉంటుంది. ఈ ప్రతిపాదనను కార్మిక శాఖ అనుమతి కోసం పంపించారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నందువల్ల 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలన్ వెల్లడించారు.

గృహనిర్మాణం, పెళ్లి, పిల్లల చదువు తదితర కారణాలకు కూడా ఈ 75% పరిమితి వర్తిస్తుందన్నారు. పీఎఫ్ ఉద్దేశం వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించడమని, దానికి కాకుండా మరే కారణానికి ఆ మొత్తాన్ని ఉపయోగించడం సరికాదని తాము భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. 58 ఏళ్ల లోపు వయసున్న ఈపీఎఫ్‌ఓ సభ్యులు గత రెండు నెలలుగా తమకే ఉద్యోగం లేదన్న కారణం చూపుతూ మొత్తం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement