నెహ్రూ జాతినిర్మాణ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు | Sakshi
Sakshi News home page

నెహ్రూ జాతినిర్మాణ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు

Published Mon, Jun 6 2016 12:01 PM

Nehru's Nation Building Idea Was Based on Junking Old Values: Amit Shah

పుణె: జవహర్ లాల్ నెహ్రూ జాతీయ నిర్మాణ కార్యక్రమం దేశంలోని విలువలను నిర్మూలించి, విదేశాలనుంచి ఆలోచనలను అరువు తెచ్చుకునే విధాన మని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.దీన దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సిద్ధాంతమే దేశంలో విలువలను  కాపాడగలదని పేర్కొన్నారు.దీన్ దయాల్ జీవిత చరిత్ర   'రాష్ట్ర్ర ద్రష్ట' ను పుణెలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. దీన దయాల్ సిద్ధాంతాల పునాదులపైననే జన సంఘ్ నిర్మాణం,బీజేపీ  స్థాపన జరిగిందని షా తెలిపారు. విభిన్న భావజాలమున్న వ్యక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం వస్తే గొప్ప తనాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఆయన పేర్కొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ఆశయ సాధనకు బీజేపీ కృషి చేస్తోందని షా అన్నారు. 
 
 

Advertisement
Advertisement