పాకిస్థాన్ ఉత్పత్తులపై నిషేధం విధించండి.. | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ ఉత్పత్తులపై నిషేధం విధించండి..

Published Mon, Sep 26 2016 8:24 PM

NGO condemns Uri terror attack, seeks ban on Pakistani goods

ముంబైః వాణిజ్య రాజధాని ముంబైలో పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళన ప్రారంభమైంది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా  పాకిస్థాన్ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలంటూ ఓ ఎన్జీవో సంస్థ పిలుపునిచ్చింది.

జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని ఉరీలో ఉగ్రవాదుల జరిపిన దాడిని ఖండిస్తూ ముంబై యూత్ అసోసియేషన్ పాకిస్థాన్ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధానికి డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా మార్కెట్లలో ఉన్న పాకిస్థాన్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలంటూ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ భవ్నానీ ఓ ప్రకటనలో తెలిపారు. పొరుగుదేశమైన పాకిస్థాన్ అమానవీయ చర్యను వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ముంబై సహా దేశంలోని అన్ని నగరాల్లోని షాపింగ్ మాల్స్, దుకాణాలనుంచి పాకిస్థాన్ ఉత్పత్తులను తొలగించాలని ప్రదీప్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement