అరుణాచల్ ప్రదేశ్ లో బలపరీక్ష వాయిదా | Sakshi
Sakshi News home page

అరుణాచల్ ప్రదేశ్ లో బలపరీక్ష వాయిదా

Published Sat, Jul 16 2016 4:00 PM

No floor test after Nabam Tuki resignation

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఆ రాష్ట్ర సీఎం, శాసన సభా పక్ష నాయకునిగా ఉన్న నబమ్ టుకీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త  శాసనసభా నాయకునిగా ఎన్నికైన పెమా ఖండు ఈ రోజు బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. కాగా బలపరీక్ష వాయిదా పడింది.

మొత్తం 58 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు బలపరీక్ష నిర్వహించాల్సి ఉంది. బలపరీక్షకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనందువల్లే వాయిదా పడినట్టు సమాచారం.

 

Advertisement
Advertisement