15తో 'సరి-బేసి'కి తెర... | Sakshi
Sakshi News home page

15తో 'సరి-బేసి'కి తెర...

Published Sat, Jan 9 2016 6:52 PM

15తో 'సరి-బేసి'కి తెర...

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్‌ విధానాన్ని ఈ నెల 15వ తేదీతో ముగిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని పొడిగించే ఆలోచన లేదని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా రోజు విడిచి రోజు వాహనాలను రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానాన్ని 15 తేదీ వరకు కొనసాగించాలని మొదట నిర్ణయించారు. 15 తర్వాత ఈ విధానంపై సమీక్ష నిర్వహిస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ శనివారం తెలిపారు. అయితే ఈ విధానాన్ని మరింతకాలం పొడిగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

15 రోజలకు మించి కూడా ఈ విధానాన్ని పొడిగించవచ్చునని కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఢిల్లీ వాయుకాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 'సరి-బేసి' విధానం వల్ల ఇప్పటికే 5893 మందికి చలాన్లు విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ విధానం ప్రయోగాత్మక అమలును ఈ నెల 15తో చాలించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement