డర్టీ బాంబులతో భయంలేదు! | Sakshi
Sakshi News home page

డర్టీ బాంబులతో భయంలేదు!

Published Mon, Aug 15 2016 8:04 AM

డర్టీ బాంబులతో భయంలేదు!

బార్క్ డెరైక్టర్ కె.ఎన్.వ్యాస్

న్యూఢిల్లీ: రేడియో ధార్మిక పదార్థాలతో తయారయ్యే ‘డర్టీ బాంబ్’తో భారత్‌కు ప్రమాదమేమీ లేదని, ఆ బాంబు తయారీకి ఉపయోగించే రేడియోధార్మిక పదార్థ ఉనికిని గుర్తించే సాంకేతికత మన దగ్గర ఉందని బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) డెరైక్టర్ కె.ఎన్.వ్యాస్ చెప్పారు. డర్టీ బాంబులకు సంబంధించి వ్యాస్ తెలిపిన వివరాలు.. ‘డర్టీ బాంబ్ అనేది అణు బాంబు కాదు. అయితే, ఆ స్థాయి లో కాకపోయినా కొంతవరకు అది మానవాళికి నష్టం కలిగిస్తుంది. కేన్సర్ చికిత్సకు వాడే కోబాల్ట్-60 వంటి రేడియో ధార్మిక పదార్థాన్ని ఉపయోగించి తయారుచేసిన బాంబును పేలిస్తే.. అది వ్యాపించినంతమేరా నష్టం కలిగి స్తుంది.

భారత్‌లో అణుపదార్థాల నిర్వహణ కట్టుదిట్టంగా ఉంటుంది. అందువల్ల రేడియోధార్మిక పదార్థాలు విద్రో హ శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం చాలా తక్కువ. ఆసుపత్రుల్లో, పరిశ్రమల్లో వాడే కోబాల్ట్-60, సీసియం తదితర రేడియో ధార్మిక పదార్ధాలతో కొంత ప్రమాదం ఉంది. అయితే, సీసియంను లవణ రూపంలో ఉపయోగిస్తారు. లవణ రూ పంలో ఉన్న సీసియంను పెన్సిల్స్ రూపంలో గాజు పదార్థంలో సురక్షితంగా భద్రపరచడం ద్వారా.. అది నీటిలో కరగకుండా, గాలిలో వ్యాపించకుండా నిరోధించే సాంకేతికతను రూపొందించాం. ఇదొక వినూత్న విధానం’ అని చెప్పారు.

Advertisement
Advertisement