పెట్రోల్‌ బంకులు కిటకిట | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకులు కిటకిట

Published Fri, Dec 2 2016 5:10 PM

పెట్రోల్‌ బంకులు కిటకిట - Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్‌ బంకులు వినియోగదారులతో పోటెత్తాయి. పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకునేందుకు ప్రజలు బంకుల ముందు బారులు తీరారు. దీంతో నగరంలోని పెట్రోల్‌ బంకులన్నీ జనంతో కిటకిటటలాడాయి. డిసెంబర్‌ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో జనం పెట్రోల్‌ బంకులకు పరుగులు పెట్టారు. పాత రూ. 500 నోటుతో నా బైకులో పెట్రోల్‌ పోయించుకునేందుకు వచ్చానని ముంబై శివారు ప్రాంతం మలాద్‌ లో ఓ పెట్రోల్‌ బంకు ముందు నిలుచున్న అక్షయ్‌ ముగ్దల్‌ అఏ వ్యక్తి తెలిపాడు.

మరోవైపు సామాన్యుల నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతున్నారు. బ్యాంకుల్లో పడిన జీతం డబ్బులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దక్షిణ ముంబైలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన మంగళదాస్‌ వస్త్రాల మార్కెట్‌ మూడు వారాలుగా డీలా పడింది. పాత పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్‌ ఖాళీ అయిపోయిందని, పిల్లలు ఇక్కడ క్రికెట్‌ ఆడుకుంటున్నారని వస్త్ర దుకాణదారు ఒకరు చెప్పారు. మిగతా వ్యాపారాలు కూడా దారుణంగా పడిపోయాయి.

Advertisement
Advertisement