ఉగ్రవేటలో ఇక మహిళా దళం | Sakshi
Sakshi News home page

ఉగ్రవేటలో ఇక మహిళా దళం

Published Sat, May 7 2016 1:19 PM

Now, women battalion set to fight Naxals

అజ్మీర్: ఉగ్రవాదులు, నక్సల్స్ వేటలో ఇక నుంచి మహిళా రక్షక దళం కూడా తన పాత్రను పోషించనుంది. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ 
ఫోర్స్ (సీఆర్పీఫ్) 232 మహిళా బెటాలియన్ కు చెందిన 567 మంది మహిళలు  నలభై నాలుగు వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకొని  అజ్మీర్ లో అవుట్ పరేడ్ ను  నిర్వహించారు.
 
ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని వారు శపథం చేశారు. ఈ  సమావేశంలో పాల్గొన్నసీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో ఆత్మవిశ్వాసంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నక్సల్ ను వేటాడేందుకు మహిళా రక్షక దళం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కరాటే, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన వీరు ఆయుధాలు లేకున్నా పోరాటం చేయగలరు.
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement