వాళ్ల కోసం మ్యారేజ్ బ్యూరో | Sakshi
Sakshi News home page

వాళ్ల కోసం మ్యారేజ్ బ్యూరో

Published Tue, Mar 22 2016 12:42 PM

వాళ్ల కోసం మ్యారేజ్ బ్యూరో

అహ్మదాబాద్: స్వలింగ సంపర్కుల కోసం భారత్ లో తొలిసారిగా మ్యారేజ్ బ్యూరో అందుబాటులోకి రానుంది. భారతీయ హోమోసెక్సువల్స్ కోసం అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో మ్యారేజ్ బ్యూరో ప్రారంభించనున్నట్టు అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బెనహర్ శామ్సన్ ప్రకటించారు. మెడికల్ టూరిజంలో పనిచేస్తున్న శామ్సన్.. సరోగసీ ద్వారా గే దంపతులు పిల్లలు పొందేందుకు సేవలు అందిస్తున్నారు.

స్వలింగ సంపర్కులు తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు మ్యారేజ్ బ్యూరో ప్రారంభిస్తున్నట్టు శామ్సన్ తెలిపారు. తన క్లైంట్ల నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 'జూన్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వివాహ సమానత్వ హక్కులు ప్రకటించారు. తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు హోమోసెక్సువల్స్ పెద్ద సంఖ్యలో ఇండియాకు వస్తున్నారు. ఇలాంటి వారికి మనమే భాగస్వాములను ఎందుకు వెతికిపెట్టకూడదన్న ఆలోచన వచ్చింద'ని హైదరాబాద్ నుంచి ఫోన్లో పీటీఐతో చెప్పారు.

డేటింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే తమ మ్యారేజ్ బ్యూరో విభిన్నంగా ఉంటుందని తెలిపారు. సంబంధాల కోసం ఇప్పటికే 250 మంది తమను సంప్రదించారని, వీరిలో ఎక్కువ మంది భారతీయులున్నారని వెల్లడించారు. తమ పోర్టల్ ద్వారా 19 మంది స్వలింగ సంపర్కులకు వివాహాలు జరిపించామని తెలిపారు. దేశంలో 12 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని 2012లో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన చూస్తే గే మ్యారేజ్ బ్యూరోకు గిరాకీ బాగానే ఉండొచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement