Sakshi News home page

స్థూలకాయంలో మూడో స్థానం!

Published Fri, Apr 10 2015 1:30 AM

స్థూలకాయంలో మూడో స్థానం!

అమెరికా, చైనాల తర్వాత మనమే
 

న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత అత్యధిక మంది స్థూలకాయులు, అధిక బరువు గల వారు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. భారత్‌లో కౌమారదశలో ఉన్న పిల్లల్లో 11 శాతం, మిగతా పెద్దల్లో 20 శాతం మంది స్థూలకాయులుగా లేదా అధిక బరువుతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపం సంబంధిత అంశాలపై ‘గ్లోబల్ అలయెన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘మాల్‌న్యూట్రిషన్ మ్యాపింగ్ ప్రాజెక్టు’ పేరుతో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం..

► వివిధ దేశాల్లో సగం మంది గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలు 74 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
►    {పతి వెయ్యి మంది పిల్లల్లో 56 మంది ఐదో పుట్టినరోజుకు ముందే చనిపోతున్నారు.
►    ఐదేళ్లలోపు పిల్లల్లో 47.9 శాతం మంది పెరుగుదల సమస్యలు ఎదుర్కొం టున్నారు.
►    పౌష్టికాహార లోపం, స్థూలకాయం, అధిక బరువు వంటివే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి.
►    భారత్‌లో చిన్నారుల మరణానికి విటమిన్, ఖనిజ పోషకాలు, ఇతర పౌష్టికాహార లోపమే ప్రధాన సమస్యగా ఉంది.
►    దేశంలో 46 శాతం మంది పిల్లలకు మాత్రమే ఆరునెలల పాటు తల్లిపాలు పడుతున్నారు.
►    పౌష్టికాహార లోపం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సుమారు 200 బిలియన్ డాలర్ల భారం పడుతోంది.
►   30కి పైగా అల్ప, మధ్య, అధిక ఆదాయ దేశాలకు చెందిన సమాచారాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా మ్యాపులో చేర్చారు.
 

Advertisement
Advertisement