భూత వైద్యులే డాక్టర్లు

4 Aug, 2018 19:56 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల బదులుగా తాంత్రికులు

బిహార్‌లోని వైశాలిలో ఘటన

పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌లో ప్రభుత్వం అసుపత్రిలో వైద్యులకు బదులుగా తాంత్రికులు, భూతవైద్యులు రోగులకు క్షుద్ర పూజలతో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని హజీపూర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యుల చికిత్స అందించకుండా భూతవైద్యులతో చట్ట విరుద్ద కార్యాకలపాలకు పాల్పడుతున్నారు.

రోగులను బెడ్లపై పడుకోపెట్టి చీపుర్లతో తీవ్రంగా కొడుతూ.. మంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఓ రోగి చప్పిన సమాచారం ప్రకారం పాము కాటుకు గురైన తనని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడున్న వైద్యులు తాంత్రికుల వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. ఇప్పటికే షల్టర్‌ హోమ్‌ ఘటనతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నితీష్‌ కుమార్‌కు ఈ ఘటనతో మరోసారి ఆరోపణలు ఎదుర్కొక తప్పదు.

మరిన్ని వార్తలు