Sakshi News home page

ఇసుక సాయంతో నూనె

Published Mon, Jul 4 2016 2:28 AM

ఇసుక సాయంతో నూనె

జోధ్‌పూర్ : షార్క్ కాలేయం నుంచి లభించే స్క్వాలీన్ అనే నూనె లాంటి పదార్థాన్ని ఐఐటీ జోధ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు రాజస్థానీ ఇసుక నుంచి ఉత్పత్తి చేశారు. షార్క్‌లను చంపి వాటి కాలేయం నుంచి నూనెను వెలికితీసేవారు. ఇప్పుడీ  నూనెను ఇసుక నుంచి ఉత్పత్తి చేయడంతో సొరచేపల వేట తగ్గే వీలుంది.

ఈ నూనెను ఎక్కువగా సౌందర్య ఉత్పత్తులు, పోషకాహార, ఔషధ తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. మొదటగా ఇసుకను నీళ్లు, యాసిడ్‌తో శుభ్రపరిచి పోడి చేశామని, అనంతరం దీనికి మెటల్ సాల్ట్‌ను కలపగా వచ్చిన ఆల్గల్ ఆయిల్‌ను 500 డి గ్రీల వద్ద వేడి చేయగా వందశాతం స్వచ్ఛమైన స్క్వాలిన్ ఆయిల్ లభ్యమైందని కెమిస్ట్రీ లెక్చరర్ రాకేశ్ శర్మ, పోస్ట్ డాక్టరోల్ ఫెలో వినీత్ కె సోనీ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement