బాబరీ మసీదు కక్షిదారు హషీం అన్సారీ మృతి | Sakshi
Sakshi News home page

బాబరీ మసీదు కక్షిదారు హషీం అన్సారీ మృతి

Published Wed, Jul 20 2016 11:08 AM

Oldest Babri Litigant Hashim Ansari Dies

లక్నో: అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో పాతతరం కక్షిదారు హషీం అన్సారీ(96) మృతి చెందారు. కొంత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం అయోధ్యలో తుది శ్వాస విడిచారు. అన్సారీ వివాదాస్పద స్థలం బాబ్రీ మసీదుకే చెందుతుందని 1949 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. 1992 డిసెంబర్ 6 న  బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కరసేవకులు హషీం ఇంటిని కూడా కూల్చేశారు.

హిందూ కక్షిదారులు రామ్ కేవల్ దాస్, రామ చంద్ర పరమహంస, దింగంబర్ అఖాడా లతో హషిమ్ సన్నిహితంగా మెలిగినా అయోధ్య అంశంపై వారితో తీవ్రంగా విభేధించేవారు. హిందునేతలతో కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు హషీమ్ తీవ్ర కృషి చేశారు. హిందూ ముస్లింల సామరస్యత కోసం తీవ్ర కృషి చేశారు. ఉత్తరప్రదేశ్ మైనారిటీ మంత్రి ఆజంఖాన్ ముస్లింలను మోసం చేస్తున్నాడని  ఇటీవల తీవ్రంగా విమర్శించారు. కొన్ని విషయాల్లో నరేంద్రమోదీని పొగిడేవారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement