అభివృద్ధే మా లక్ష్యం | Sakshi
Sakshi News home page

అభివృద్ధే మా లక్ష్యం

Published Wed, Dec 28 2016 2:20 AM

అభివృద్ధే మా లక్ష్యం - Sakshi

ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పని చేస్తా: మోదీ

- ధనవంతుల కోసం కాదు.. పేదల కోసమే పనిచేస్తున్నాం
- నోట్ల రద్దు ఒక క్లీన్‌నెస్‌ డ్రైవ్‌.. దీంతో నల్లధనం, ఉగ్ర నిధులు, మానవ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది

డెహ్రాడూన్‌: తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యం అభివృద్ధే అని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తాను నిరంతరం పనిచేస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందన్నారు. ధనవంతులు, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పని చస్తున్నారన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ పరివర్తన్‌ మహార్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. రూ. 12 వేల కోట్ల విలువైన 900 కి.మీ. చార్‌ధామ్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులు ఎలాంటి వాతావరణ ఇబ్బం దులు లేకుండా సులువుగా యాత్రను పూర్తి చేయడం వీలవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు అనే ఒకే ఒక్క నిర్ణయంతో నల్లధనం, ఉగ్రవా దులకు నిధులు అందకుండా చేయడంతో పాటు మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలను అడ్డుకున్నా మని చెప్పారు. కొంత మంది తన నిర్ణయంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారని, దొంగల నాయకులను తాము అడ్డుకోవడమే దీనికి కారణమని నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో 18 వేల గ్రామాల ప్రజలు విద్యుత్‌ లేకుండానే జీవించేవారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 12 వేల గ్రామాలకు విద్యుత్‌ అందించామని, మరో ఆరు వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించే చర్యలు తీసుకుంటున్నామని, ఇది ధనవంతుల కోసం చేస్తున్న పనా? లేక పేదల కోసం చేస్తున్న కృషా? అని ప్రశ్నించారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ఇప్పటి వరకూ కప్‌బోర్డ్స్, పరుపుల కింద దాచిన నల్లధనం బ్యాంకులకు చేరుకుంటోందని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో చౌకీదార్‌(వాచ్‌మన్‌)గా తన పని తాను చేశానని చెప్పారు.

వారి రక్తంలోనే అవినీతి ఉంది
‘‘కొంత మంది రక్తంలోనే అవినీతి ఉంటుంది. వారు నల్లధనాన్ని మార్చుకునేందుకు దొడ్డిదారిని ఉపయోగిస్తున్నారు. ఇదంతా మోదీకి కనిపించదని వారు భావిస్తున్నారు. కానీ వారేం చేస్తున్నారనేది మాకు తెలుసు. ఇప్పుడు వారంతా పట్టుబడతారు’’ అని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా చేస్తున్న దాడులను మోదీ ప్రస్తావించారు. నోట్ల రద్దు అంశాన్ని ప్రధాని మోదీ ఒక క్లీన్‌నెస్‌ డ్రైవ్‌ (పరిశుభ్రతా కార్యక్రమం)గా అభివర్ణించారు. దీనికి మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, వారికి మంచి భవిష్యత్తును అందజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలోని నిజాయితీపరుల సాధికారత కోసం.. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటానికి తొలి అడుగుగా నవంబర్‌ 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ముందస్తు బడ్జెట్‌తో ప్రయోజనాలెన్నో  
న్యూఢిల్లీ: ముందస్తు బడ్జెట్‌తో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వివిధ రంగాలు నిధు లు అందుకునే అవకాశం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. నీతి ఆయోగ్‌ సదస్సులో ఆర్థికవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... దేశ వాస్తవ ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ సమర్పణ తేదీల మార్పు ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కాలవ్యవధి వల్ల తొలకరికి ముందు ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయపు పన్ను రేట్ల సరళీకరణతోపాటు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా కస్టమ్స్‌ పన్ను ల్లో మార్పుల్ని ఆర్థికవేత్తలు సూచించారని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగరియా అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement