ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయట! | Sakshi
Sakshi News home page

వేలకొద్దీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులు ఖాళీ

Published Sat, Jul 21 2018 1:00 PM

Over 2,400 IAS, IPS Posts Vacant In Country, Says Govt - Sakshi

న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్‌ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్‌ పోస్టులు, 970 ఐపీఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. 

ఈ పోస్టులకు అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.
అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి
నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.

పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు
జనరల్‌ అభ్యర్థులు-4 సార్లు
ఒబిసి అభ్యర్థులు-7సార్లు
వికలాంగులు (జనరల్‌)- 7 సార్లు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.

Advertisement
Advertisement