స్ట్రిక్ట్ చేస్తే.. సగం మంది ఫెయిలయ్యారు | Sakshi
Sakshi News home page

స్ట్రిక్ట్ చేస్తే.. సగం మంది ఫెయిలయ్యారు

Published Mon, May 30 2016 8:47 AM

స్ట్రిక్ట్ చేస్తే.. సగం మంది ఫెయిలయ్యారు

పాట్నా: గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈసారి కఠిన నిబంధనలు పాటించడంతో బిహార్లో సగానికి పైగా పదో తరగతి విద్యార్థులు ఫెయిలయ్యారు. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 28శాతం ఉత్తీర్ణత పడిపోయింది. మొత్తం పరీక్ష రాసిన విద్యార్థుల్లో కేవలం 15.47లక్షల మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. వీరంతా మొత్తం పరీక్ష రాసినవారిలో సగానికన్నా తక్కువమందే. కాగా, మొత్తం టాప్ టెన్ లో 24 మంది బాలికలు, 18 బాలురు ఉండగా వీరంతా కూడా జాముయి జిల్లాలోని సిముల్తాలా అవాసియా విద్యాలయానికి చెందిన వారే.

గతంలో ఈ టాప్ ర్యాంకులు నెటారట్ లో ఉన్నప్రముఖ పాఠశాలకు దక్కేవి. ప్రస్తుతం ఆ పాఠశాల జార్ఖండ్కు వెళ్లింది. గత ఏడాది వైశాలిలో మాస్ కాపీయింగ్కు పాల్పడిన వీడియో బయటకు వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి పరీక్షల్లో కఠిన నిబంధనలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలు కూడా ఏర్పాటుచేశారు. పోలీసులను భారీ సంఖ్యలో పరీక్ష కేంద్రాల వద్ద తిప్పారు. దీంతో గత ఏడాది మొత్తం 75.17శాతం విద్యార్థులు పరీక్షల్లో పాస్ కాగా ఈసారి మాత్రం 50శాతాని కన్నా తక్కువగా ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 10.86శాతం మంది మాత్రం ఫస్ట్ డివిజన్లో పాసయ్యారు. కాగా, ఎక్కువమంది విద్యార్థులు పరీక్షల్లో తప్పడం వల్ల తామేం బాధపడటం లేదని, నిజంగా టాలెంట్ ఉన్న విద్యార్థులు మాత్రమే పోటీ పరీక్షల్లో నిలిచారని విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఇక మున్ముందు అత్యున్నత ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement