పాఠశాలలపై పాక్‌ సైన్యం కాల్పులు | Sakshi
Sakshi News home page

పాఠశాలలపై పాక్‌ సైన్యం కాల్పులు

Published Wed, Jul 19 2017 8:23 AM

Pakistan targets schools near LoC in Jammu, students escape death

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పాఠశాలలు లక్ష్యంగా పాకిస్తాన్‌ సైన్యం మంగళవారం కాల్పులకు తెగబడింది. రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లోని నాలుగు సెక్లార్లలో పాక్‌ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పాఠశాలలపై మోర్టారు బాంబులు, తుపాకులతో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ పాఠశాల భవనం ధ్వంసమైంది.

నౌషెరా, మాంజ కోట్‌ సెక్టార్లలోని మూడు పాఠశాలల్లోని 217 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులను భద్రతా దళాలు రక్షించాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో వారిని తరలించినట్లు రాజౌరీ ఉప కమిషనర్‌ చెప్పా రు. సమీపంలో మోర్టారు బాంబులు పడటంతో భవానీ ప్రాంతంలోని సహాయక బృందాలకు, ఓ పాఠశాలలోని విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement