సానియా మీర్జా అత్తారింటికి దారెట్లా? | Sakshi
Sakshi News home page

సానియా మీర్జా అత్తారింటికి దారెట్లా?

Published Fri, Sep 30 2016 4:02 PM

సానియా మీర్జా అత్తారింటికి దారెట్లా?

న్యూఢిల్లీ: భారత్, పాక్‌ సరిహద్దుల్లో ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే హైదరాబాదీ అమ్మాయి, టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా తన అత్తగారి ఇంటికి ఎలా వెళ్లేది? షోయబ్‌ మాలిక్‌ భారత్‌కు వచ్చి క్రికెట్‌ ఎలా ఆడాలి చెప్పండి? దాదాపు 70 ఏళ్లుగా ఇరుగు పొరుగుగా ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు పొరపొచ్చాలు రావడం సహజమే.ఏ ఘర్‌ ఘర్‌కా కహానీ హై. అంతమాత్రాన ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కు పెట్టుకోవాలా! యుద్ధం చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు లేవా?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఛాయ్‌ అమ్మడంలో ఎంతో అనుభవం ఉందని ప్రపంచమంతా చెప్పుకుంటోంది. అలాగే పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌కు దహీ బల్లా తయారు చేయడంలో ఆరితేరినవారు. రాజకీయాల్లోకి రాకముందు పాక్‌ వీధుల్లో దహీ బల్లా (పెరుగు, ఆలు, వడతో తయారు చేస్తారు. ఉత్తర భారతం, పంజాబ్‌లో ఫేమస్‌ డిష్‌) అమ్ముకునేవారు. ఇద్దరి మధ్య సరిహద్దుల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేసి అంతర్జాతీయ పోటీ నిర్వహిద్దాం.


అలాగే బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్, పాకిస్తాన్‌ సినీ నటుడు, దర్శకుడు సాహిర్‌ లోధి మధ్య యాక్టింగ్‌ పోటీ పెడదాం. కావాలనుకుంటే బాలీవుడ్‌ సింగర్, సంగీత దర్శకుడు హిమేష్‌ రేషమియా, తాహిర్‌ షా మధ్య పాటల పోటీని నిర్వహిద్దాం. ఏదేమైనా సరే పాకిస్థాన్‌ నటి, టీవీ ప్రెజెంటర్‌ మీరా, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బాలివుడ్‌ నటుడు అష్మిత్‌ పటేల్‌ మధ్య ముద్దు సీన్‌ చూడకుండా ఎలా నిద్రపోయేది! ఇంకా కావాలనుకుంటే హిందీ, ఉర్దూ భాషల్లో రాహుల్‌ గాంధీ, బిల్వాల్‌ భుట్టో మధ్య స్పెల్‌ బీ పోటీలు నిర్వహిద్దాం.

పాక్‌పై సర్జికల్‌ దాడులు చేసి ఇప్పుడు పైచేయి అనిపించుకున్నావు. కానీ ‘సాస్‌ బీ కబీ బహూ తీ’ అనే విషయాన్ని మరచిపోతున్నావు. కొట్లాడుకుంటే ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’. గిల్లికజ్జాలు వద్దు, గిల్లి దండ ఆడుదాం. మనం మనం కలసి మాట్లాడుకుందాం. కావాలంటే పొరుగువాళ్ల మీద రాళ్లేద్దాం. ఇప్పుడు మనం కలిస్తే రేపైనా మన అమ్మ,నాన్నలు కలుస్తారు.

(ప్రముఖ కరాచీ కమేడియన్‌ షెహజాద్‌ ఘియాస్‌ షేక్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన కామెంట్స్‌ నుంచి..)

Advertisement
Advertisement