15 నెలల్లో అభివృద్ధి చేస్తాం | Sakshi
Sakshi News home page

15 నెలల్లో అభివృద్ధి చేస్తాం

Published Sun, Feb 26 2017 2:05 AM

15 నెలల్లో అభివృద్ధి చేస్తాం - Sakshi

మణిపూర్‌ ఎన్నికల సభలో మోదీ
ఇంఫాల్‌: పదిహేనేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మణిపూర్‌ తీవ్రంగా వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 15 నెలల్లో అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్‌ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, 10 శాతం కమీషన్  తీసుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారమిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ పాలనలో మణిపూర్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు తాగునీరు అందించడంతో ప్రభుత్వం విఫలమైంది.

15 ఏళ్లలో ఆ పార్టీ చేయలేని పనిని(రాష్ట్ర అభివృద్ధి)ని మా ప్రభుత్వం 15 నెలల్లోనే చేస్తుంది’ అని చెప్పారు. ‘15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం 10 పర్సెంట్‌ సీఎం అని నేను విన్నాను. వంద శాతం నిజాయతీగల సీఎం కావాలా, లేకపోతే 10 శాతం కమీషన్  తీసుకునే వ్యక్తి కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం భారీగా పంపుతున్న నిధుల్లో అధిక భాగాన్ని నేతలు, అధికార పార్టీ మంత్రులు దారి మళ్లిస్తున్నారన్నారు.

నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం
నాగా మిలిటెంట్లతో కేంద్రం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఇబోబీ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. మణిపూర్, మణిపురీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమేదీ ఒప్పందలో లేదని స్పష్టం చేశారు. ‘ఏడాదిన్నర కిందట ఆ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ’ అని మండిపడ్డారు. యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌(యూఎన్ త ఏడాది నవంబర్‌ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరవధిక ఆర్థిక దిగ్బంధాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే తొలగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఔషధాలు, ఇతర సరుకులు అందక అల్లాడతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement