ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు

Published Sun, Apr 9 2017 12:25 PM

ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు - Sakshi

జమ్ముకాశ్మీర్‌:  శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప​ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా నేడు పది అసెంబ్లీ స్థానాలకు, శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీనగర్‌ లోక్‌సభ పరిధిలోకి వచ్చే బుద్గాం, గండేర్‌బల్‌, శ్రీనగర్‌లలో ఎన్నికల నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ బుద్గాం, గండేర్‌బల్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలింగ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అల్లరిమూకలపై కాల్పులు జరపగా ఇద్దరు వ్యక్తులు మహ్మద్ అబ్బాస్, ఫైజాన్ అహ్మద్ రాథోడ్ చనిపోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం.
 

ఎంపీలో కాంగ్రెస్ నేత కారుపై దాడి
మధ్యప్రదేశ్ లోని బంధవ్ గఢ్ నియోజవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరగడం లేదని అధికారులు చెప్పారు. భింద్ ఏరియాలో కాంగ్రెస్ నేత కారుపై ఇద్దరు ఆందోళనకారులు వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బీజేపీ నేతలు ఈ పని చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నాలుగు ఈ ఈవీఎంలు మోరాయిస్తుంటే వాటి స్థానంలో కొత్తవి అమర్చడంతో ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు.

 

Advertisement
Advertisement