అబార్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

అబార్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

Published Wed, Jan 29 2020 5:22 PM

Prakash Javadekar Says Abortions To Be Allowed At 24 Weeks - Sakshi

న్యూఢిల్లీ : అబార్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ చేసుకోవాలనే గర్భిణీలకు 24 వారాల వరకు అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం 20 వారాల వరకే గర్భిణీలకు అబార్షన్‌ చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గర్భిణీలకు 24 వారాల వరకు అబార్షన్‌ వెసులుబాటు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

అయితే తొలి ఐదు నెలల(20 వారాల) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణీలు అబార్షన్‌ చేసుకోవాలంటే.. కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళలు గర్భాన్ని తొలగించుకునే కాల పరిమితిని పెంచాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నట్టు చెప్పారు. వైద్యులు కూడా ఇదే రకమైన సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అబార్షన్‌ కాలపరిమితిని 24 వారాలకు పెంచినట్టు వివరించారు. 

Advertisement
Advertisement