ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్‌పవర్: ప్రణబ్ | Sakshi
Sakshi News home page

ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్‌పవర్: ప్రణబ్

Published Mon, Nov 21 2016 1:46 AM

ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్‌పవర్: ప్రణబ్

 చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘క్లీన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి పథకాలు విజయవంతమైతే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా మారుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సీఐఐ ఆగ్రో-టెక్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం పలు కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.

ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సరికొత్త పథకాలను చేపట్టింది. వీటిని కనుక విజయవంతంగా అమలు చేసినట్లరుుతే భారతదేశం ప్రపంచంలోనే ఒక సుసంపన్నమైన, శక్తివంతమైన, ఆధునిక ఆర్థిక శక్తిగా మారడం తథ్యం’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఆధునిక ఆర్థిక శక్తిగా మారడానికిగాను మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ఎంతో కీలకమని ఆయన అన్నారు.

Advertisement
Advertisement